APSRTCలో బదిలీలు, నియామకాలు.. ఉత్తర్వులు జారీ

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఉన్నత అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయి.

APSRTCలో బదిలీలు, నియామకాలు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఉన్నత అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయి. ఈ మేరకు రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిషన్ జి.వి. రవి వర్మను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజినీరింగ్ గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం జోన్ ఈడీ బ్రహ్మానందరెడ్డిని హెడ్ ఆఫీస్ కు బదిలీ చేశారు. ఆయన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిన్ గా నియమిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీసీ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story