- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: ఒకేసారి 57 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 57మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. అంతేకాదు 8 కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. దేవాదాయ కమిషనర్‌గా సూర్య కుమారి, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ గా జి.గణేశ్ కుమార్, విజయనగరం కలెక్టర్‌గా నాగలక్ష్మి, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సృజన, అనంతపురం కలెక్టర్‌గా పి.గౌతమి, సత్యసాయి కలెక్టర్‌గా పి. అరుణ్ బాబు, బాపట్ల కలెక్టర్‌గా రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి గత నెలలోనే బదిలీ ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, వరుస ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో ప్రస్తుతం సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి బదిలీ జాబితాను సిద్ధం చేయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. దీంతో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.






