- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ.. మంత్రి దుర్గేష్ వెల్లడి
దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్-2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ నెల(మే) 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ (ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్) సమ్మిట్ -2025 లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు.
ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్క్ లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అంతేకాక ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం మరియు డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ MOU దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే రూ. 300 కోట్ల కేంద్ర నిధులను రాబట్టారు. పర్యాటక రంగంలో రూ. 1200 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టి 8 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. తద్వారా వేలాది సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించనున్నారు. తాజా ఒప్పందంతో మరింత మంది యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉంది.






