- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చిత్తూరు వెళ్లే రైళ్లు దారి మళ్లింపు
చిత్తూరు – సిద్దంపల్లి స్టేషన్ల మధ్య రైళ్లను దారి మళ్లించారు. మరమ్మతుల కారణంగా ఈ చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

దిశ, చిత్తూరు: చిత్తూరు – సిద్దంపల్లి స్టేషన్ల మధ్య రైళ్లను దారి మళ్లీంచారు. ఈ రెండు స్టేషన్ల మధ్య కి.మీ.31/23–25 ప్రాంతంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.27 వద్ద నీటి కాలువ (వాటర్ డ్రెయిన్) పనులతో కూడిన ఓవర్‌హాలింగ్ పనులను రైల్వే శాఖ చేపట్టనున్నట్లు రైల్వే శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు–సిద్దంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ 31/23–25 వద్ద ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ నం.27 (మోసానికల్ గ్రౌండ్ సమీపంలో) వద్ద ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే పరిపాలన ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టనుంది.
ఈ పనులలో భాగంగా లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద వాటర్ డ్రెయిన్‌కు సంబంధించిన మరమ్మతులు, అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. ఈ పనులు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగనున్నందున... ఆయా తేదీల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలు తెలిపారు. ఈ చర్య పూర్తిగా ప్రజల భద్రత కోసమేనని, పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ఈ ఏర్పాట్లు చేయబడినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకొని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడంతో పాటు అధికారులకు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజల సహకారంతోనే పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారులు తెలిపారు.






