ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ - దువ్వాడ మధ్య రైళ్లు రద్దు

by Naga Rani Yarlagadda |

దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. విజయవాడ - దువ్వాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ - దువ్వాడ మధ్య రైళ్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. విజయవాడ - దువ్వాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ పోర్టు - విశాఖపట్నం (17267), విశాఖ - కాకినాడ పోర్టు (17268), రాజమండ్రి - విశాఖ (67285), విశాఖ - రాజమండ్రి (67286) రైళ్లను ఈ నెల 20న రద్దు చేసినట్లు తెలిపారు. కాగా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 12న నర్సాపూర్ - సికింద్రాబాద్, 15న అనకాపల్లి - సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Next Story