రాష్ట్రంలో విషాద ఘటనలు.. ఈతకెళ్లి నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-29 16:16:03  IST  )

రాష్ట్రంలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కావడంతో ఎంజాయ్ చేద్దామనుకుంటే ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలు అనకాపల్లి, సత్యసాయి జిల్లాల్లో జరిగాయి. ..

రాష్ట్రంలో విషాద ఘటనలు.. ఈతకెళ్లి నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కావడంతో ఎంజాయ్ చేద్దామనుకుంటే ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలు అనకాపల్లి, సత్యసాయి జిల్లాల్లో జరిగాయి. అనకాపల్లిలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. సత్యసాయి జిల్లాలో తండ్రీకొడుకు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి సమీప ఉమ్మలాడ శారద నదిలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు అనకాపల్లి సాయినగర్‌కు చెందిన కుమార్, హర్షగా గుర్తించారు. సత్యసాయి జిల్లా హంద్రీనీవా కాలువలో తండ్రి, కుమారుడు గల్లంతయ్యారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి వద్ద ఈతకు వెళ్లి నీటిలో కొట్టుకుపోయారు. తండ్రి, బాలుడి మృతదేహాలు వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు రెండో చోట్లా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story