- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: గాలి, వాన లేకుండానే కూలిన భారీ వృక్షం.. మహిళ స్పాట్ డెడ్
విశాఖ సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీతమ్మధార(Visakhapatnam Seethammadara)లో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళ(Women)పై భారీ వృక్షం( Huge Tree) మీద పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే ఆమెకు స్థానికులు సీపీఆర్(Cpr) చేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు. శబ్ధం విని పరిగెత్తుకుంటూ వెళ్లామని, అప్పటికే మహిళపై చెట్టు మీద పడిందని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఉండే మహిళ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. వర్షం, గాలి వాన లేకుండానే చెట్టు కూలడం స్థానికంగా కలకలం రేపింది. ఇదే ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మరో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ప్రమాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలను జీవీఎంసీ(Gvmc) అధికారులు వెంటనే తొలగించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






