తిరుచానూరులో విషాదం.. కారులో ఊపిరాడక ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |

తిరుచానూరులో విషాదం చోటు చేసుకుంది...

తిరుచానూరులో విషాదం.. కారులో ఊపిరాడక ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా తిరుచానూరు(Tiruchanuru)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. కారు(Car)లో ఊపిరాడక ఇద్దరు యువకులు(Two Youth) మృతి చెందారు. దిలీప్, వినయ్‌లు నిన్న రాత్రి కారులో ఏసీ(AC) వేసుకుని మద్యం సేవించారు. ఆ తర్వాత కారులోనే పడుకున్నారు. అయితే రాత్రి సమయంలో డీజిల్ అయిపోయి కారు ఇంజిన్ ఆగిపోయింది. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు ఊపిరాక నిద్రలోనే మృతి చెందారు. ఈ రోజు ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story