టీడీపీలో విషాదం.. కీలక నేత మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-12 15:09:42  IST  )

శ్రీకాకుళం టీడీపీలో విషాదం చోటు చేసుకుంది...

టీడీపీలో విషాదం.. కీలక నేత మృతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం(Srikakulam) టీడీపీ(Tdp)లో విషాదం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ(Senior leader Gunda Appala Suryanarayana) కన్నుమూశారు. ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు.


దీంతో శ్రీకాకుళం నగరంలో విషాదచాయలు అలుముకున్నాయి. నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సూర్యనారాయణ సేవలు అందించారు. టీడీపీ నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Next Story