కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-08 13:21:03  IST  )

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది...

కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District)లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నది(Krishna River)లో స్నానానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు షేక్ ఖుద్దూస్, షేక్ ఫారూఖ్‌గా గుర్తించారు. వీరిలో ఖుద్దూస్ మృతదేహం లభ్యమైంది. మరొకరు ఫారూఖ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఖుద్దూస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Next Story