ఏలూరులో విషాదం.. కాలువలోకి దిగి యువకులు మృతి

by Vemula.Srinu Prasad |

ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువలో స్థానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు...

ఏలూరులో విషాదం.. కాలువలోకి దిగి యువకులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు(Eluru)లో విషాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ(Konguvarigudem YerraKaluva)లో స్థానానికి దిగి ఇద్దరు యువకులు(Two Young Men) మృతి చెందారు. స్థానికి గ్రామానికి ఇద్దరు స్నేహితులు శనివారం మధ్యాహ్నం ఎర్రకాలువ వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగారు. కొద్దిసేపు సేదతీరారు. అయితే ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో మునిగిపోయారు. వెంటనే మరో యువకుడు రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నీటిలో కొట్టిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ, ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో రెస్కూ ఆపరేషన్ చేశారు. కాలువలోకి దిగి ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాలువల్లో ఈత, స్నానానికి దిగే యువతకు పలు సూచనలు చేశారు. కాలువల్లో స్నానం చేయొద్దని, ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. ఈత రాని పక్షంలో ఒడ్డునే కూర్చోవాలని తెలిపారు. నిపుణుల సమక్షంలో ఈతకు వెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు.. చెరువులు, కాలువలకు దూరంగా ఉంటే మంచిదని తెలిపారు. ఈత, స్నానం కంటే ప్రాణాలు చాలా ముఖ్యమని చెప్పారు. యువకుల నడవడికపై తల్లిదండ్రులు ఓ కన్ను వేసి ఉంచాలని, వేసవి సెలవుల్లో చెరువులు, కాలువలు, సముద్రం, బావుల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.

Next Story