తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-12 04:32:03  IST  )

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది..

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన కోరుకొండ మండలం కాపవరం(Kapavaram)లో జరిగింది. కాపవరానికి చెందిన శ్రీరాములు, పలసాని అన్నవరం, జాజులు వెంకన్న.. గౌడైన్ నుంచి టాలీలో బియ్యం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో కపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు.

Next Story