- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
by Vemula.Srinu Prasad |
ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Weather Department) తెలిపారు. బంగాళాఖాతం(Bangalakhatham)లో కేంద్రీకృతమైన అల్పపీడనం(low pressure) వాయువ్య దిశగా కదులుతోందని, ఇది తీవ్ర అల్పపీడనం బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంపై తీవ్ర అల్పపీడనం పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
Next Story






