- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం.. మహిళ మృతి, మరొకరి కోసం గాలింపు
విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఆర్కే బీచ్(Visakhapatnam RK Beach)లో విషాదం చోటు చేసుకుంది. సముద్రం(Sea)లో స్నానానికి ముగ్గురు గల్లంతు అయ్యారు. ఒకరు ఒడ్డుకు చేరుకోగా మహిళ మృతి చెందారు. మరొకరి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మృతి చెందిన మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సముద్రంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో ఒక్కసారిగా తమను కెరటాల లాక్కెళ్లాయని.. సురక్షితంగా బయటకు వచ్చిన వ్యక్తి తెలిపారు. పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి కుటుంబం విశాఖకు వెళ్లింది. బీచ్‌లో సరదాగా స్నానానికి దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్ర కెరటాల భారీ ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు.
Next Story






