- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో విషాదం.. తెలంగాణ భక్తుడి మృతి.. అసలు ఏం జరిగిందంటే!
by Jakkula.Mamatha |
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. అయితే శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్న ఓ భక్తుడు మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ఆయన తెలంగాణ వాసిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా(Rangareddy), షాద్‌నగర్(Shadnagar)కు చెందిన వెంకటేశ్(50) కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో నిన్న(మంగళవారం) ఉదయం తిరుమలకు బయలుదేరాడు. 400వ మెట్టు వద్ద ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో ఆ భక్తుడిని వెంటనే చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Next Story






