Three People Die : పండుగ పూట విషాదం...ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-15 12:24:55  IST  )

పండుగ(Festival) పూట ఓ కుటుంబం(Family)లో విషాదం నెలకొంది. వరుసగా ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు(Three People Die) కోల్పోయారు.

Three People Die : పండుగ పూట విషాదం...ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పండుగ(Festival) పూట ఓ కుటుంబం(Family)లో విషాదం నెలకొంది. వరుసగా ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు(Three People Die) కోల్పోయారు. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే...అతడి అంత్యక్రియల వేళ మద్యం సేవించి కుమారుడు, అతడి బావమరిదిలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రులో చోటు చేసుకుంది. చామర్రు గ్రామంలో గౌతుకట్ల కోటయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు.

అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కుమారుడు నాగేశ్వరరావు, అతను బామ్మర్ది తెల్ల మేకల నాగేశ్వరరావు మద్యం కొనుగోలు చేసి తాగారు. వెంటనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గంట వ్యవధిలో ఇరువురూ ప్రాణాలు విడిచారు. పండగ పూట ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో చామర్రులో విషాదం నెలకొంది.

అయితే మద్యంలో గౌతుకట్ల నాగేశ్వరరావు, తెల్లమేకల నాగేశ్వరరావు ఎలుకల మందు కలుపుకుని తాగారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story