మరికొద్ది గంటల్లో తమ్ముడి పెళ్లి... అంతలోనే విగతజీవిగా మారిన అన్న

by Vemula.Srinu Prasad |

ఆ ఇంట్లో మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. తమ్ముడిని పెళ్లికొడుకుగా చూసి మురిసిపోవాల్సిన అన్న.. అంతలోనే విగతజీవిగా మారాడు..

మరికొద్ది గంటల్లో తమ్ముడి పెళ్లి... అంతలోనే విగతజీవిగా మారిన అన్న
X

దిశ, వెబ్ డెస్క్: ఆ ఇంట్లో మరికొద్ది గంటల్లో పెళ్లి(Marriage) బాజాలు మోగాల్సి ఉంది. తమ్ముడిని పెళ్లికొడుకుగా చూసి మురిసిపోవాల్సిన అన్న.. అంతలోనే విగతజీవిగా మారాడు. విజయనగరం జిల్లా(Vizianagaram District) మిర్తివలస గ్రామం(Mirthivalasa Village)లో జరిగిన ఈ విషాద(Sad) ఘటన స్థానికులను కలచివేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సతీష్ తన తమ్ముడి వివాహ వేడుకల కోసం ఇంటికి వచ్చి, విధి ఆడిన వింత నాటకానికి బలయ్యాడు.

విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తూ...

పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొన్న సతీష్ స్నానం చేసిన తర్వాత తన దుస్తులను ఆరవేసేందుకు మేడపైకి వెళ్లాడు. అయితే, పెళ్లి డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తూ అతడికి తగిలాయి. తడి బట్టలతో ఉండటంతో విద్యుత్ ప్రభావం తీవ్రంగా ఉండి సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు.

శోకసంద్రంలో పెళ్లి ఇల్లు

సంతోషంతో వెలిగిపోవాల్సిన ఆ పెళ్లి ఇల్లు ఒక్కసారిగా సతీష్ మరణంతో శోకసంద్రమైంది. చేతికి అందిన కొడుకు ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Next Story