Alert:ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. ఆ మార్గంలో నిలిచిన రాకపోకలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-18 13:10:06  IST  )

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Alert:ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. ఆ మార్గంలో నిలిచిన రాకపోకలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన వాతావరణం(Weather) నెలకొంటుంది. పగలంతా ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం కాగానే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Rains) కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాపు నీరు(Rain Water) ఇళ్లలోకి చేరిపోయింది. కొన్ని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఈ భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా(Kurnool) హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో కట్రవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి పెరగడంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)-కర్ణాటక(Karnataka) రాష్ట్రాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల ఎగువన భారీ వర్షం(Heavy Rain) కురవడంతో వాగు ఉప్పొంగుతుంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా.. చింతకుంటలో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. వంతెన(bridge)పై నీటి ప్రవాహం పెరగడంతో ఒకటి, రెండు రోజులపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.

Next Story