అరకు ఘాట్ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

by Muthe.Rajitha |

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్డులో ఆదివారం భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

అరకు ఘాట్ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్డులో ఆదివారం భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. రెండవ శనివారం, ఆదివారం సెలవులు కావడంతో విశాఖపట్నం నుంచి అరకు వైపు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో టూరిస్ట్‌ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ముఖ్యంగా ఉడెన్‌ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోగా.. పర్యాటకులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. ప్రతిఏటా డిసెంబర్‌ లో అరకు లోయలో ఉష్ణోగ్రతలు 5 నుంచి 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం వల్ల పొగమంచు వాతావరణం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.

అలాగే బొర్రా గుహలు, కాఫీ తోటలు, చపరాయి వంటి పర్యాటక ప్రాంతాలకు భారీగా పర్యాటకులు క్యూ కట్టారు. దీంతో అరకు ఘాట్ లో విపరీతమైన రద్దీ ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరుకైన ఘాట్‌ రోడ్‌ వలన వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Next Story