- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉధృతంగా మూడు వాగులు.. 100కి పైగా గ్రామాలకు రాకపోకలు బంద్
ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వర్షానికి చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: మూడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 100కి పైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ పరిస్థితులు ఎన్టీఆర్ జిల్లా(Ntr District)లో నెలకొన్నాయి. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం(low pressure) కారణంగా రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు సైతం వర్షపు నీటితో నిండిపోయాయి. మున్నేరు(Munneru), కట్లేరు(Katleru) వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంకపల్లి దగ్గర బుడమేరు వాగు(Budameru Stream)కు వరద భారీగా పెరిగింది. మరోవైపు గుడివాడ, ఉంగుటూరు, జగ్గయ్యపేట, అవనిగడ్డ, నందిగామ దగ్గర వంతెన పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో 5 మండలాల్లో 100కుపైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read..






