అయోధ్య వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఏపీ వాసుల మృతి

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పర్యాటకుల బస్సు ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. నైమిశారణ్యం దర్శించుకుని శ్రీరాముడి జన్మభూమి అయోధ్య వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..

అయోధ్య వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఏపీ వాసుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) నరసరావుపేట(NarasaraoPet)కు చెందిన పర్యాటకుల బస్సు(Tourist bus) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఘోర ప్రమాదానికి గురైంది. నైమిశారణ్యం దర్శించుకుని శ్రీరాముడి జన్మభూమి అయోధ్య వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో పాటు టూరిస్ట్ గైడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బస్సు బోల్తా పడిన వేగానికి లోపల ఉన్న ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు అందించారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

నరసరావుపేటలో ఆందోళన.. క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యుల ఆరా

మరోవైపు యాత్రకు వెళ్లిన వారి బస్సు ప్రమాదానికి గురైందనే వార్త తెలియగానే నరసరావుపేటలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడి అధికారులను సంప్రదిస్తూ ఆరా తీస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు, వారిని సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు స్థానిక నాయకులు, అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Next Story