శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత

by Muthe.Rajitha |

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లిఖార్జున స్వామి భక్తులకు మరో నిరాశ ఎదురవనుంది.

శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్ : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లిఖార్జున స్వామి భక్తులకు మరో నిరాశ ఎదురవనుంది. భక్తులకు మల్లిఖార్జున స్వామి ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేసారు. గత రెండు రోజులుగా ఆలయానికి శివదీక్ష విరమణ భక్తుల తాకిడి తీవ్రంగా పెరిగింది. ఈ క్రమంలోనే స్వామివారి స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి, ఈవో ప్రకటన విడుదల చేసారు. ఈనెల 8 వరకు స్పర్శ దర్శనాలు ఉండవని, సిఫార్సు లేఖలతో వచ్చే వారికి కూడా స్పర్శ దర్శన అనుమతి లేదని పేర్కొన్నారు.

మరోవైపు రూ. 5 వేల టికెట్టుపై గర్భాలయ అభిషేకాలు, రూ.1500 పై సాధారణ అభిషేకాలు మాత్రం ఈనెల 5 వరకు ఉంటాయన్నారు. భారీగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత నిబంధనను గమనించుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే శ్రీశైలానికి వస్తున్న భక్తుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో, మల్లన్న ఆలయ వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.

Next Story