Heavy Rains Effect:కుండపోత వర్షాలు.. ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన రాకాసి అలలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.

Heavy Rains Effect:కుండపోత వర్షాలు.. ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన రాకాసి అలలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ(Andhra Pradesh)లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ తరుణంలో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామాన్ని రాకాసి అలలు చుట్టుముట్టాయి.

దీని ప్రభావంతో దాదాపు గ్రామంలోని 70 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గృహాలు నేలకూలగా మరో 30 ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోనున్నాయి. దీనిపై రంగంలోకి దిగిన రెవెన్యూ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సముద్రపు నీటిని మళ్లించేందుకు జేసీబీ సాయంతో మార్గం ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని గంటల తర్వాత నీరు వెనక్కి మళ్లింది. అయితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజులు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

Next Story