- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కుండపోత వర్షం.. విజయవాడ, గుంటూరులో బీభత్సం
ఏపీలో కుండపోత వర్షం కురుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడ, గుంటూరులోనూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. గుంటూరు విద్యానగర్‌లో మెయిన్ రోడ్డు జలమయం అయింది. ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ జోరుగా వర్షం కురిసింది. దీంతో నార్త్ సెంటర్, మూడు వంతెనలు, లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు. పండగపూట కావడంతో భక్తులు, పత్రిల వ్యాపారులు కూడా ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పత్రిలు తడిసిముద్దయ్యాయి. దీంతో రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. అటు విజయవాడలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పలు కాలనీలు నీటమునిగాయి. వినాయక చవితతో కాలనీలు, వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. వర్షపు నీరు చేరడంతో నిర్వాహకులు నిరాశ చెందుతున్నారు.






