- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APPSC:రేపే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష.. సర్వత్రా ఉత్కంఠ!
రాష్ట్రంలో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష(Group-2 Exam) వాయిదా వేయాలంటూ అభ్యర్థులు(Candidates) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష(Group-2 Exam) వాయిదా వేయాలంటూ అభ్యర్థులు(Candidates) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్(Group 2 Mains Exams) పోస్ట్ పోన్ చేయాలంటూ అభ్యర్థులు నిరసనలు చేశారు. ఇదిలా ఉంటే.. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అనేక వివాదాల నడుమ 905 గ్రూప్-2 పోస్టులకు మెయిన్స్ పరీక్ష రేపు(ఆదివారం) జరగనుంది.
రోస్టర్‌లో లోపాలు సరిచేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇదే విషయంపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జ్ ధర్మాసనం పరీక్షల వాయిదాకు నిరాకరించింది. దీంతో అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ(శనివారం) విచారణ జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక నిన్న(శుక్రవారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పందిస్తూ పరీక్ష వాయిదాపై లీగల్ టీమ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.






