- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tomato Price: కనిష్ట ధరకు పడిపోయిన టమాటా.. కిలో ఎంతంటే..?
టమాటా ధరలు రోజు రోజు పడిపోతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: టమాటా(Tomoto) ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. నిన్న, మొన్న వరకూ కిలో రూ. 20 పలికిన టమాటా ధరలు తాజాగా కనిష్టానికి దిగిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ప్రతి రోజు పతనమవుతున్నాయి. కష్టపడి పండించిన పంటలకు పెటుబడి కూడా రావడం లేదని మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనంతపురం జిల్లాలో టమాటా సాగుబడి భారీగా ఉంటుంది. ఇక్కడ పండిన టమాటా స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది. అయితే తాజాగా అనంతపురం కుక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా రూ.12కు అమ్ముడు పోయింది. మార్కెట్‌కు రూ.600 టన్నుల టమాటా రాగా సరాసరి ధర రూ.10 కాగా కనిష్ట ధర రూ.8 పలికినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే టమాటా ధరలు భారీగా పడిపోతాయని చెప్పారు. టమాటా సాగు చేయడానికి రైతులు వెనకడుగేసే అవకాశం ఉందని తెలిపారు. దిగుబడి బాగానే ఉన్నా ధరలు మాత్రం లేవని అటు రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






