- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది మేడం’.. పవన్ కల్యాణ్ భార్యపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అగ్ని ప్రమాదం నుంచి తన కొడుకు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదం నుంచి తన కొడుకు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ రాత్రి ఆమె తిరుమలలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే ఆమె తలనీలాలు ఇవ్వడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘హిందూ మతాన్ని అనుసరించే నేను మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను మేడం. సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే, అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి’ అని పోస్టు పెట్టారు.
ఇదిలా ఉండగా.. అన్నా లెజినోవా టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
.@PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామివారి మొక్కులో భాగంగా తలనీలాలను సమర్పించడం జరిగినది., హిందూ మతాన్ని అనుసరించే నేను ఎంతో గర్వపడుతున్నాను మేడం 🙏
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 13, 2025
సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే,
అన్యమతం నుండి వచ్చి… pic.twitter.com/K2S6HzOYFV






