ఎమ్మెల్యే వాహనంలో దర్జాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. నిధి అగర్వాల్ ఘటన మరువకముందే!

by Gantepaka Srikanth |

ఎమ్మెల్యే వాహనంలో దర్జాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్

ఎమ్మెల్యే వాహనంలో దర్జాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. నిధి అగర్వాల్ ఘటన మరువకముందే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వాహనం(MLA vehicle)లో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రయాణించడం ఏపీలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ట్రోల్ చేశారు. అనంతరం దానిపై హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని.. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అయితే.. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరో ఘటన వెలుగుజూసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో నిర్మాత నాగవంశీ(Suryadevara Naga Vamsi) కనిపించారు. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌(Anagani Satya Prasad)కి చెందిన కారుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. నటి నిధి అగర్వాల్ ఘటన మరవకముందే నిర్మాత నాగవంశీకి చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story