‘దేశంలోనే నెంబర్ వన్ సీఎం’.. తేల్చి చెప్పిన టాలీవుడ్ హీరో

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-15 10:55:54  IST  )

ప్రముఖ సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలోనే నెంబర్ వన్ సీఎం’.. తేల్చి చెప్పిన  టాలీవుడ్ హీరో
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తన అనుభవం, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారని సీనియర్ హీరో సుమన్(Hero Suman) పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం చంద్రబాబు ఒక విజనరీ. ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరించగలిగే సమర్థుడు చంద్రబాబు అంటూ.. దేశంలోనే నెంబర్ వన్ సీఎం చంద్రబాబే’’ అని ఆయన తేల్చి చెప్పారు.

ఈ తరుణంలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే సీఎం చంద్రబాబు(CM Chandrababu) వల్లే సాధ్యం అవుతుందన్నారు. హైదరాబాద్‌(Hyderabad)ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్చర్ మ్యాప్‌ను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

నేడు ఏపీ(Andhra Pradesh) అభివృద్ధి(Development) అంటే ఒక పరీక్ష వంటిదని.. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి. ప్రజలందరూ అందుకు సహకరించాలి అని సుమన్ తెలిపారు. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనేదానికి ప్రయారిటీ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో మనకు కావాల్సింది ఇప్పుడే జరగాలి అంటే కుదరదు, అందుకోసం వేచి చూడాలి అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సహకారం ఉంది అని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story