- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Photo Viral: సడన్‌గా చూసి కృష్ణదేవరాయలు అనుకున్నా.. ఇంకాస్త పరిశీలించి చూస్తే..
అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్(Tollywood) హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్(Tollywood) హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఒకరు. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలైనా.. రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన విషయాలైనా అభిమానులు క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించి.. లీకైన ఫొటోలే సగం ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేస్తుంటాయి. ఆ రేంజ్‌లో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తుంటారు. తాజాగా.. పవన్ కల్యాణ్‌ను కృష్ణదేవరాయలు(Krishna Devaraya) అవతారంలో ముస్తాబు చేసి ఏపీలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లిన ఓ అభిమాని ప్లెక్సీని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. ఇక అంతే.. ఆ ఫొటో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది.
కాగా, ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ ఉన్న విషయం తెలిసిందే. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలోని చిత్రాడలో ఈ సభ నిర్వహిస్తున్నారు. దీనికి ‘జయకేతనం’ సభగా పేరు పెట్టారు. ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే.. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు రాబోతున్న నేపథ్యంలో అందరినీ ఆకట్టుకునేలా పవన్ కల్యాణ్ కృష్ణదేవరాయలు అవతారంలో ఉన్న ఫొటోలను ప్లెక్సీలుగా ఏర్పాటు చేస్తున్నారు.






