- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ..ముహూర్తం ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబుతో రేపు పలువురు సినీపెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వం వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుతో రేపు పలువురు సినీపెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వం వహించనున్నారు. చంద్రబాబు కంటే ముందు సినీపెద్దలు పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీ కోసం సినిమా పెద్దలు సీఎం అపాయింట్‌మెంట్ కోరగా దానికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సమావేశంలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీరంగ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. అమరావతిలో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగబోతున్నట్టు సమాచారం. ఇక ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తవరాత సినిమా పెద్దలు సీఎం చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమావాళ్లు సీఎంను కలవకపోవడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.






