- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
CM Jagan సర్కార్ Good News.. నేడు వారి అకౌంట్లోకి రూ.10 వేలు
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. నేడు ఈ పథకం లబ్దిదారులకు ఆర్ధిక సాయం విడుదల చేయనుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్నారు. నేడు విజయవాడలోని విద్యాధరపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఇవాళ ఆటో, మ్యాక్సీ, టాక్సీ డ్రైవర్ల అకౌంట్లలో రూ.10 వేలు జమ కానున్నాయి.
శుక్రవారం ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి విద్యాధరపురం చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసి సభలో బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ ఏడాదికిగాను 2,75,931 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.275.93 కోట్లు జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.1,301.89 కోట్లు ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు నాలుగు విడతల సొమ్ము విడుదల చేయగా.. ఇప్పుడు ఐడో విడత నగదు జమ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Vizag రాజధాని అనే మాట అభాసుపాలు: సీపీఐ జాతీయ కార్యదర్శి K Narayana