- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Vizag రాజధాని అనే మాట అభాసుపాలు: సీపీఐ జాతీయ కార్యదర్శి K Narayana
దిశ, డైనమిక్ బ్యూరో : విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పరిపాలన సాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగుతుందని ప్రకటించారు. అయితే విశాఖ రాజధాని అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధాని అనే మాట అభాసు పాలైందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం గంజాయి, బెట్టింగ్ దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ధ్వజమెత్తారు. ఆ దందా పరాకాష్టకు చేరినట్లు చెప్పుకొచ్చారు. బెట్టింగ్ ముఠా, గంజాయి ముఠాలకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. విజయవాడ కేంద్రంగా ఆ బెట్టింగ్, గంజాయి ముఠాలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మఫియాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈడీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు విశాఖపట్నం మద్యం మాఫియాకు, భూ దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి : జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేడు వారి అకౌంట్లోకి రూ.10 వేలు