నేడు చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన..ఆంక్షలతో హైటెన్షన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-09 05:15:12  IST  )

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో జగన్ మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకోనున్నారు.

నేడు చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన..ఆంక్షలతో హైటెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో జగన్ మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బంగారుపాలెంలో మామిడి రైతులను కలుసుకుంటారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేతలు కామెంట్లు చేయడం, ఎస్పీ ఆంక్షల నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

జగన్ పర్యటనకు పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మామిడి రైతులు మాత్రమే కార్యక్రమానికి రావాలని చెప్పారు. కానీ ఈ కార్యక్రమానికి 30 వేల మందిని తీసుకురావాలని వైసీపీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే బంగారుపాళ్యంలో 600 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక వైసీపీ నేతలు కూడా తగ్గడం లేదు. జిల్లాలో జగన్ పర్యటించే రహదారుల్లో భారీగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. జనాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను రప్పించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ పర్యటన ఎలా సాగుతుందో చూడాలి.

Next Story