నేడు జాతీయ చేనేత దినోత్సవం.. మంగళగిరికి సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ గుంటూరు జిల్లా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నియోజకవర్గమైన మంగళగిరి (Mangalagiri)లో పర్యటించనున్నారు.

నేడు జాతీయ చేనేత దినోత్సవం.. మంగళగిరికి సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ గుంటూరు జిల్లా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నియోజకవర్గమైన మంగళగిరి (Mangalagiri)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆటో‌నగర్‌లోని హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను తిలకించి కార్మికులతో సమావేశమై వారి బాగోగులు తెలుసుకుని వారితో మాట్లాడనున్నారు. ప్రజావేదికపై నుంచి చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.

Next Story