అయేషా మీరా కేసులో నేడు కీలక ఘట్టం.. 19 ఏళ్ల తర్వాత అస్థికలకు అంతిమ సంస్కారాలు

by Ajay Maddhiboyina |

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన‌ అయేషా మీరా హ‌త్య‌ కేసు నేడు కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది. 19ఏళ్ల త‌ర‌వాత ఈ రోజు అయేషా అస్థిక‌ల‌కు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు.

అయేషా మీరా కేసులో నేడు కీలక ఘట్టం.. 19 ఏళ్ల తర్వాత అస్థికలకు అంతిమ సంస్కారాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన‌ అయేషా మీరా హ‌త్య‌ కేసు నేడు కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది. 19ఏళ్ల త‌ర‌వాత ఈ రోజు అయేషా అస్థిక‌ల‌కు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు. కోర్టు ఆదేశాల మేర‌కు ఆయేషా ఆస్థిక‌ల‌ను, శ‌రీర భాగాల‌ను ఆమె త‌ల్లిదండ్రుల‌కు అధికారులు అప్ప‌గిస్తారు. అనంతరం ఆమె స్వ‌స్థ‌లం తెనాలిలో సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో కుటుంబం అంతిమ సంస్కారాలు జ‌ర‌ప‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా సంఘాలు, లాయ‌ర్లు అయేషా మీరాకు సంఘీభావంగా ర్యాలీకి పిలుపునిచ్చాయి. విజ‌య‌వాడ‌లో కోర్టు నుండి అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ర‌కు లాయ‌ర్లు, ప్ర‌జా సంఘాలు ర్యాలీ చేయ‌నున్నారు. అనంత‌రం అయేషా త‌ల్లి దండ్రుల వెంటే తెనాలి వెళ్ల‌డానికి ఛ‌లో తెనాలి కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్‌యంలో విజ‌య‌వాడ‌, తెనాలిలో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు.

అయేషా కేసులో ఏం జరిగింది..

ఇదిలా ఉంటే 2007 డిసెంబ‌ర్ 27న విజ‌య‌వాడ శివార్ల‌లోని ఓ హాస్ట‌ల్ బాత్రూమ్ లో ఫార్మ‌సీ విద్యార్థిని అయేషా హ‌త్య జ‌రిగింది. అక్క‌డే దొరికిన లేఖ‌లో అయేషాను ప్రేమించాన‌ని ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో హ‌త్య చేశాన‌ని అందులో రాసి ఉంది. పోలీసుల ద‌ర్యాప్తులో స‌త్యంబాబు అనే వ్య‌క్తిపై అనుమానం వ‌చ్చి అరెస్ట్ చేశారు. త‌ర‌వాత కోర్టు అత‌డికి ప‌దేళ్లు క‌ఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో బంధువులు, ప్ర‌జాసంఘాలు స‌త్యంబాబును కేసులో ఇరికిస్తూ నిందితుల‌ను త‌ప్పిస్తున్నార‌ని న్యాయపోరాటం చేశాయి. దీంతో 8ఏళ్ల త‌ర‌వాత అత‌డిని కోర్టు నిర్దోశిగా విడుద‌ల చేసింది. త‌ర‌వాత జ‌రిగిన దర్యాప్తులో అయేషాపై అత్యాచారం, హ‌త్య జ‌రిగింద‌ని సిట్ గుర్తించింది. కేసులో స‌త్యంబాబుతో పాటు మొద‌టినుండి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ రాజ‌కీయ కుటుంబానికి చెందిన వార‌సుడిని సిట్ ప్రశ్నించింది. ఈ లోపు ద‌హ‌న‌సంస్కారాలు నిర్వ‌హించేందుకు కుటుంబ స‌భ్యులు అస్థిక‌ల‌ను, శ‌రీర భాగాల‌ను కోర‌డంతో కోర్టు అంగీక‌రించింది.

Next Story