నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-24 05:05:44  IST  )

నేడు ఏపీ కేబినెట్ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. నేటి భేటీలో ఎస్ఐపీబీ ప్రతిపాద‌న‌ల‌కు కేబినెట్ స‌మావేశంలో ఆమోదం తెల‌ప‌నున్నారు.

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం!
X

దిశ‌, వెబ్ డెస్క్/డైనమిక్​బ్యూరో: ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. దాదాపు 32 అంశాలతో అజెండాను రూపొందించారు. ముఖ్యంగా అమరావతిలో (Amaravathi) పరిపాలన భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న పలు సంస్థలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. అదే విధంగా మలివిడత భూసేకరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రూ.882.47 కోట్లతో జేడీ టవర్, రూ.1,487.11 కోట్లతో హెచ్​వోడీ కార్యాలయాలకు ఆయా సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రూ.1303.85 కోట్లతో ఇతర పరిపాలన భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేయనుంది. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్​స్ట్రక్టర్ల పోస్టుల అప్​గ్రేడ్​కు ఆమోదం తెలపనుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ భూ కేటాయింపు పై చర్చ జరగనుంది.

ఎకరా రూ.50 లక్షలు చొప్పున జరిగిన భూ కేటాయింపు నిర్ణయంపై మంత్రివర్గంలో పున సమీక్షించనున్నారు. చదరపు మీటరు రూపాయికి తగ్గించే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 7 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపనుంది. ఏపీ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనలు సవరణలకు మంత్రివర్గం ఆమోదించనుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కల్పించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు అనుమతులపై చర్చిస్తారు. అదేవిధంగా హైడ్రో, సంప్రదాయేతర వనరుల విద్యుత్ ప్రాజెక్టులపై ఏర్పాటుపై చర్చించనున్నారు.. ఇటీవల ఎస్ ఐపీబీ లోని నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంటుకు భూకై టాయింపు ప్రతిపాదనపై చర్చించనున్నట్లు సమాచారం. 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలు కేటాయించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రూ.1,582.98 కోట్ల పెట్టుబడులతో ఎనిమిది వేల మందికి కాగ్నిజెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

Next Story