- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ.. టీడీపీ కైవసం
తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్పదవి టీడీపీ కైవసం అయింది. చైర్‌పర్సన్‌గా కొలికపోగు నిర్మల ఎన్నియ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్పదవి టీడీపీ (TDP) కైవసం అయింది. చైర్‌పర్సన్‌గా కొలికపోగు నిర్మల ఎన్నియ్యారు.నిర్మలకు మద్దతుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా డీఆర్వో లక్ష్మీనరసింహం వ్యవహరించారు. గతంలో కోరం లేకపోవడం తదితర కారణాలో పలుమార్లు ఎన్నిక వాయిదా పడింది. సోమవారం కో రం సరిపోవడంతో ఛైర్‌పర్సన్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ పదవిని రిజర్వేషన్‌లో ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. వైసీపీకి (YCP) చెందిన నిర్మల గత నెల 19న ఎమ్మెల్యే సమక్షంలో తెదేపాలో చేరారు. గత నెల 19, 20 తేదీల్లో ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విడత 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నిక పూర్తయింది.






