- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన.. సర్కార్‌కు రిపోర్ట్ ఇచ్చిన న్యాయ కమిషన్
తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ ఘటనలో 150 మందిని విచారించిన కమిషన్ ఎస్పీ సుబ్బారాయుడు, అప్పటి సీవీఎస్ శ్రీధర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. అదేవిధంగా డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించలేదని కమిషన్ పేర్కొంది. అదేవిధంగా టీటీడీ (TTD) జేఈవో గౌతమి కూడా వైఫల్యమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలపై క్రిమినల్ చర్యలకు తీసుకోవాలని, జేఈవో గౌతమి చర్యలకు జీఏడీకి సిఫారసు చేయాలని కమిషన్ సూచించింది. అయితే, ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతి (Tirupati)లో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 9న ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా మొత్తం నాలుగు ప్రాంతాల్లో జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 48 మందికి తీవ్రగాయాలయ్యాయి.






