- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: తొక్కిసలాట ఘటన.. నేడు తిరుపతికి న్యాయ విచారణ కమిషన్
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ సత్యనారాయణ మూర్తి (Justice Satyanarayana Murthy) ఆధ్వర్యంలోని న్యాయ విచారణ కమిషన్ తిరుమల (Tirumala), తిరుపతి (Tirupati)లోని క్యూలైన్ల నిర్వహణను పరిశీలించనుంది. అయితే, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు, గాయపడిన వారిని ఇప్పటికే జస్టిస్ సత్యనారాయణ మూర్తి వర్చువల్‌గా విచారించారు. విచారణలో భాగంగా తిరుపతి కలెక్టర్ (Tirupati Collector)తో పాటు, టీటీడీ ఈవో శ్యామల రావు (TTD EO Shyamala Rao)లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మేరకు వారిని ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెల 19న నుంచి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఉద్యోగులను (TTD Employees) కమిషన్ విచారించనుంది.
కాగా, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కౌంటర్ వద్ద జనవరి 8న తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట జరగిన విషయం తెలిసిందే. ఈ ఘటననలో ఆరుగురు మృతి చెందగా..48 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు సర్కార్ నిజాలు నిగ్గు తేల్చేందుకు, ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది.






