Tirupati | స్విమ్స్‌లో వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

by Thanuru Gopichand |   (  Updated:2025-12-21 05:59:38  IST  )

​తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో వివిధ తాత్కాలిక ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ రిజిస్ట్రార్ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Tirupati | స్విమ్స్‌లో వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
X

దిశ, వెబ్ డెస్క్ : ​తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో వివిధ తాత్కాలిక ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ రిజిస్ట్రార్ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. వీటిలో రీసర్చ్ సైంటిస్ట్ - 03 పోస్టులు, టెక్నికల్ సపోర్ట్ - 09 పోస్టులు, నర్స్ - 09 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ణీత పరీక్షల ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. అయితే ఈ ఉద్యోగాలన్నీ ప్రాజెక్ట్ కాలపరిమితికి లోబడి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. విద్యా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://svimstpt.ap.nic.in ను సందర్శించాలని రిజిస్ట్రార్ సూచించారు. వైద్య రంగంలో సేవ చేయాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమని ఆమె తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 23, 2025 సాయంత్రం 5:00 గంటల వరకు ఉందని అధికారులు పేర్కొన్నారు.

Next Story