- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైరల్ అయిన మహిళ వీడియో.. స్పందించిన కిరణ్ రాయల్

దిశ, వెబ్ డెస్క్: తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Janasena leader Kiran Royal) అన్నారు. కిరణ్ రాయల్‌ను నమ్మి అప్పులు చేసి కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చానని, తన చావుకి ఆయనే కారణమంటూ లక్ష్మి అనే మహిళ చేసిన సెల్పీ వీడియో వైరల్‌గా మారడంతో ఆయన స్పందించారు. క్రిమినల్ లేడీతో తనపై నిరాధార ఆరోపణలు చేయించారని కిరణ్ రాయల్ తెలిపారు. తనకు రూ.కోటి 20 లక్షలు ఇచ్చినట్టు ఆధారాలులేవన్నారు. వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం ఇది అని ఆరోపించారు. భూమన అభినయరెడ్డి(Bhumana Abhinaya Reddy)నే మహిళతో డ్రామాలు ఆడుతున్నారని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలను అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలకు జనసేన నాయకులు కానీ జనసైనుకులు కానీ భయపడరు అని తెలియజేస్తున్నాము
— Tirupati PawanKalyanFC™ (@TirupatiPKFC) February 8, 2025
- @KiranRoyaljsp 🔥 pic.twitter.com/BoYpLvdxib