- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: బుగ్గమఠం భూముల సర్వే.. ఉద్రిక్తత
తిరుపతి బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతలకు దారి తీసింది..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి బుగ్గమఠం భూముల(Tirupati Buggamatham Lands) సర్వే ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ పోలీసుల మధ్య సర్వే కొనసాగుతోంది. గత నెలలోనే సర్వే జరగాల్సి ఉంది. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా అధికారులు సర్వే చేయలేదు. ఈ భూముల్లో సర్వే చేసేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy)తో పాటు మరో నలుగురికి ఏప్రిల్ 11న దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. 261/261/2 సర్వే నెంబర్లలోని 3.88 ఎకరాల భూములను ఆక్రమించినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు శనివారం ఉదయం బుగ్గమఠం భూములను సర్వే చేసందేకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఆ భూముల అనుభవదారులు వెంకట్రాయులు, మునిరత్నం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. వెంకట్రాయులు, మునిరత్నంతో మాట్లాడారు. అనంతరం భూముల సర్వే కొనసాగుతోంది.
కాగా బుగ్గమఠం భూముల వివాదంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే స్పందించారు. ఆ భూములతో తనకు సంబంధం లేదని చెప్పారు. తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు.






