Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Tirumala Updates: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 86,604 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 31,536 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story