Tirumala Update: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

by Kema Shiva Kumar |   (  Updated:2024-08-09 03:49:04  IST  )

దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

Tirumala Update: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 63,535 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 28,685 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story