ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-10 14:16:13  IST  )

వీఐపీ బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది..

ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ
X

దిశ, వెబ్ డెస్క్: వీఐపీ బ్రేక్ దర్శనాల(VIP Break Darshans)పై తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)లో ఈ డిసెంబర్‌తో పాటు జనవరి నెలలోనూ పలు పర్వదినాలు నిర్వహించనున్నారు. పర్వదినాల్లో ఆయా రోజుల్లో మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 23న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారా దరశనాలు, జనవరి 25న రథ సప్తమిని శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు. ఈ పర్వదినాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప మిగిలి ఏ వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదు. ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని వీఐపీ భక్తులు తదుపరి ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Next Story