డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీటీడీ బిగ్ షాక్.. అభ్యర్థన తిరస్కరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-28 13:07:17  IST  )

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. ...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీటీడీ బిగ్ షాక్.. అభ్యర్థన తిరస్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)కు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) బిగ్ షాక్ ఇచ్చింది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖ(Panchayat Raj, Revenue Department)ల అతిథిగృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి అనగాని సత్యప్రసాద్‌( Minister Satya Prasad) లేఖలు రాశారు. ఈ లేఖలను 16న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు చర్చించారు. తిరుమల కొండపై భూమి లభ్యత లేని నేపథ్యంలో పవన్, అనగాని అభ్యర్థనను తోసి పుచ్చారు.

అతిథి గృహాల్లోని భవనం కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్

అయితే తిరుమలలో ఇప్పటికే ఉన్న అతిథి గృహాల్లో పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలకు కలిపి ఓ భవనం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రెండు శాఖలకు తాజాగా తెలిపింది. గెస్ట్ హౌస్‌లు, భూముల కేటాయింపులపై హైకోర్టు పరిమితులు ఉన్నాయని, కొత్త నిర్మాణాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. శిథిలావస్థకు చేరిన గెస్ట్ హౌస్‌లు, కాలేజీలను మాత్రమే పునర్మించాలనే నిబంధనలు ఉన్నాయని టీటీడీ పేర్కొంది.

Next Story