బ్రేకింగ్ న్యూస్.. తిరుమల ఆలయం మూసివేత.. టీటీడీ కీలక ప్రకటన

by Muthe.Rajitha |

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మరో కీలక ప్రకటన జారీ చేసింది.

బ్రేకింగ్ న్యూస్.. తిరుమల ఆలయం మూసివేత.. టీటీడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మరో కీలక ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు 7న చంద్రగ్రహణం కారణంగా, తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసి, 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు జరిపే ఊమ్జల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవ వంటివన్నీ టీటీడీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. కాగా సెప్టెంబరు 7న మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల దర్శనాలను రద్దు చేసి, తిరిగి 8న సంప్రోక్షణల అనంతరం ఉదయం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతివ్వనున్నట్టు ప్రకటనలో తెలిపింది.

Next Story