తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. ఒక్కసారిగా పెరిగిన ఆదాయం

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారి ఆదాయం భారీగా పెరిగింది...

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. ఒక్కసారిగా పెరిగిన ఆదాయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి ఆదాయం(Income) భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వెంకన్న దర్శనార్ధం భక్తుల కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం రూ.3.34 కోట్లకు చేరింది. ఈ వారాంతం వెంకన్న ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


అటు భక్తుల(Devotees) రద్దీ సైతం కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో ఫుల్ అయిపోయాయి. దీంతో వెలుపల క్యూ లైన్‌లోనూ భక్తులు వేచియున్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయంపడుతోంది. 67,284 మంది భక్తులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 31,268 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Next Story