Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2024-08-14 04:13:09  IST  )

ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరగింది.

Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరగింది. వరుస సెలవుల నేపథ్యంలో సోమవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 70,728 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 29,611 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story